Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు చర్యలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ తెగిపడినట్టు నిరసన తెలిపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాయకులు నిర్ణయాలు తీసుకుంటే నచ్చని ప్రజలు మొహమాటం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైగా నేతలను తిడుతున్నారు. తమకున్న అవగాహనతో నేతలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను లెక్కలతో సహా వివరిస్తున్నారు.
ఏపీలో 2019 నుంచి 2024 వరకు వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు అమరావతిని ఆయన వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సూచించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కానీ మూడు రాజధానులకు సంబంధించిన పనులు ఐదేళ్ల పరిపాలన కాలంలో ఒక్క కూడా ముందుకు పడలేదు. దీనికి రోజుల్లో తోడు ముగిసే చివరి ఏపీ రాజధాని వైజాగ్ అంటూ ప్రకటించారు. వైజాగ్‌లోని రిషికొండ ప్రాంతంలో తాను ఒక అధికారిక నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు జగన్ ప్రకటించారు.
జగన్ మాట్లాడిన ఈ మాటలను జనం నమ్మలేదు. అందుకే 2024 ఎన్నికల్లో ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఒక రకంగా ప్రజలు నేరుగా జగన్ కు ఓటు ద్వారా తెలిపిన నిరసన ఇది. అప్పుడే అర్థమై ఉంటుంది జగన్ కు ఏపీ ప్రజలు ఎంత తెలివైన వారోనని. తాజాగా జగన్ మావిగన్ అనే ప్రకటన చేశారు. గుంటూరు.. విజయవాడ.. మచిలీపట్నం ప్రాంతాలను కలుపుతూ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది. దీనికి మావిగన్ అని పేరు కూడా పెట్టారు. అప్పట్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో మావిగన్ ప్రకటనపై రకరకాల ఛానెల్స్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒక వ్యక్తి వివరించిన తీరు మామూలుగా లేదు.
“మీ అడ్రస్ ఎక్కడుంది అంటే పలానా ప్రాంతం చెప్తారు. మా ఇల్లు ఎక్కడ ఉందంటే పలానా చోట ఉందని అంటాం. అలా కాకుండా బెడ్ రూమ్ విజయవాడలో.. బాత్రూం గుంటూరులో.. హాల్ మచిలీపట్నంలో ఉందని చెప్పలేం కదా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటికి దీన్ని ఎవరు మార్చలేరు. మావిగన్ అనేది పిచ్చికి పరాకాష్ట అంటూ” ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

