షాబాద్: నేడు షాబాద్‌కు మాజీమంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల సైకో కిల్లర్ రాజ్‌కుమార్ దాడిలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జరిగిన విషయాలను తెలుసుకోనున్నారు.
బాధిత కుటుంబాన్ని…
పోలీసులకు సంబంధించి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఎవరెవరిని కలిశారు? ఎప్పుడు ఫిర్యాదు చేశారు అన్న దానిపై బాధిత కుటుంబాలను కలసి కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

