జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మీ అయ్య జాగీరా? అని అన్నారని, తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే తెలంగాణ, ఇందులో ఎవరికీ అనుమానం కూడా అక్కర్లేదని కేటీఆర్ చెప్పారు. వందశాతం ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు, నెత్తురుతో తడిసిన నేల ఇది అని కేటీఆర్ చెప్పారు. కానీ, మీరు రండి ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి… ఉండండి, ఎవరొద్దన్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. పది, పన్నెండేళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలు కలిసి ఉండాలని కోరుకున్నామని కేటీఆర్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారని, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అనడం తప్పు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయవాదం అంటే… మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టిలు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా?అని నిలదీశారు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తామని,మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోమని కేటీఆర్ చెప్పారు.

