Lenin Success Meet: అందం , టాలెంట్ ఈ ఇద్దరు ఒకే హీరోయిన్ లో ఉండటం చాలా అరుదు. ఈమధ్య కాలంలో మన ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ లో ఈ రెండు లక్షణాలు ఉన్న హీరోయిన్స్ లో ఒకరు భాగ్యశ్రీ భోర్సే . ఈమె ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు మాత్రం ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో మారుమోగింది. వరుసగా అవకాశాలు వచ్చాయి , కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘కింగ్డమ్’, ‘కాంతా’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్‌గా నిలిచాయి. అయినా ఈమెకు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైంది.
మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ ని సాధించడమే కాకుండా , మొట్టమొదటి సూపర్ హిట్ గా కూడా నిలిచింది ఈ చిత్రం. కేవలం అఖిల్ కెరీర్ లోనే కాదు , భాగ్యశ్రీ కెరీర్ లో కూడా ఈ సినిమా మొట్టమొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో భాగ్యశ్రీ మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. తన ఎమోషన్స్ ని స్టేజి మీద కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఈమెపై సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.
ఇలాంటివి చూసినప్పుడు ఏ హీరోయిన్ కి అయినా చాలా బాధ వేస్తుంది. అనే వాళ్ళది ఎందుకని , చేతిలో మొబైల్ , ఇంటర్నెట్ ఉంటే చాలు , నోటికి ఎదోస్తే అది మాట్లాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈరోజు కోసం నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను అంటూ భాగ్యశ్రీ కంటతడి పెట్టుకుంది. ఇకపోతే ఈ చిత్రం రెండవ రోజు కూడా అన్ని ప్రాంతాలలో దుమ్ము లేపేసింది. ఊపు చూస్తుంటే కేవలం వీకెండ్ కి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
#భాగ్యశ్రీ బోర్స్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు #లెనిన్ సక్సెస్ మీట్ లో తన చివరి సినిమా తప్పకుండా తెలుగు సినిమా అవుతుందని చెప్పారు.
ఆమె హైదరాబాద్‌ను తన కర్మభూమి అని కూడా పిలిచింది. pic.twitter.com/y3PUhWjh9f
— Movies4u అధికారిక (@Movies4u_Officl) జూలై 11, 2026

