‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం NBK111. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలోకి రాకముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకుంది. ప్రైస్ ఎంతనేది తెలియరాలేదు.
ఇటీవల జీ5 సంస్థ తమ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుండి రాబోయే క్రేజీ కంటెంట్ జాబితానుఅధికారికంగా విడుదల చేసింది. ఈ అఫీషియల్ లిస్ట్‌లో బాలయ్య 111వ సినిమా బోర్డ్ చేసినట్టు అధికారకంగా ప్రకటించారు. బిగ్ స్క్రీన్ పైనే కాకుండా డిజిటల్ స్పేస్ లోనూ బాలయ్య మాస్ ర్యాంపేజ్ గట్టిగా ఉండబోతుందని ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ రేసులో బాసాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉంది. వృద్ధి సినిమా బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

