ఎర్రచందనం అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శాఖ మంత్రి పవన్ కల్యాణ్(పవన్ కళ్యాణ్) తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు.
ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించిన పవన్ కళ్యాణ్
- ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమీక్ష
- కింగ్పిన్ల నిర్మూలనకు ఆదేశం
- డ్రోన్లతో పటిష్ట నిఘా
పవన్ కళ్యాణ్: ఆంధ్రప్రదేశ్ సంపద అయిన అమూల్యమైన ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (పవన్ కళ్యాణ్)తీవ్రస్థాయిలో దృష్టిసారించారు. అమరావతిలో శాఖతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూటమి ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ ప్రక్రియ అవలంబిస్తుందని, అడవుల్లో ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
AP Pension Good News: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల ముందే పెన్షన్ల పంపిణీ
అంతర్రాష్ట్ర మూలాలపై కన్ను.. సాంకేతికతతో నిఘా:
కేవలం చెట్లు నరికే కూలీలపైనే కాకుండా, ఈ మాఫియా అసలు కింగ్పిన్లు, ఫైనాన్షియర్ల మూలాలను తుడిచిపెట్టేలా కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులను నియమించారు. ఎక్కడెక్కడ దాచినా ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులు, ఆ శాఖలతో తక్షణమే సమన్వయం పెంచుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ అరికట్టేందుకు డ్రోన్లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిఘాను పటిష్టం చేయాలన్నారు.
సమష్టి పోరాటంతోనే సంపద పరిరక్షణ:
మన రాష్ట్ర సహజ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పునరుద్ఘాటించిన డిప్యూటీ సీఎం, అన్ని శాఖలు సమష్టిగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలతో స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

