జూన్ 1న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. (పెద్ది ఈవెంట్)
పెద్ది ఈవెంట్
పెద్ది ఈవెంట్ : రామ్ చరణ్ పెద్ది సినిమా పాన్ ఇండియా వైడ్ జూన్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు పెద్ది కోసం ఆతృతగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా దేశమంతటా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే నార్త్, సౌత్ లో అనేక నగరాల్లో పెద్ది ఈవెంట్స్ జరిగాయి.
నిన్న జూన్ 1న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. అయితే హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేసారు మూవీ యూనిట్. హైదరాబాద్ లో నేడే జూన్ 2న రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. ఫొటోలు..
ఈ హైదరాబాద్ పెద్ది ఈవెంట్ కి కూడా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఏఆర్ రహమాన్, బుచ్చిబాబు సాన, నిర్మాత వెంకట సతీష్, ఇతర మూవీ యూనిట్ హాజరు కానున్నారు. ఇక రేపు జూన్ 3 రాత్రి నుంచే ఓవర్సీస్ లో, ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోలు పడుతున్నాయి.

