దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. తన నియోజకవర్గంలో తానే మోనార్క్ అని. అందుకు ఎవరూ మినహాయింపు కింద చింతమనేని తీసుకోవడం లేదు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే తరచూ ఏదో వివాదంలో ఇరుక్కోవడం చింతమనేని ప్రభాకర్ కు పరిపాటిగా మారింది. ఆయన దెబ్బకు పార్టీ నాయకత్వం కూడా అవతలి వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన చేసిన పనులు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పార్టీని డ్యామేజీ చేస్తున్నారు. అయినా సరే చింతమనేని ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
గతంలో 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలసి దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఆ ఘటన కూడా ఒక ప్రధాన కారణమైంది. 2019 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో గెలిచిన తర్వాత మరొకసారి తన దాడులను పెంచినట్లు కనపడుతుంది. చింతమనేనికి అడ్డుకట్ట వేయకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని ఏలూరు జిల్లాలో సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే ఆయన ఆగడాలు ఏ స్థాయికి వెళ్లాయో చెప్పకనే తెలుస్తుంది.
తాజాగా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి హల్ చల్ చేశారు. టీడీపీ లీగల్ సెల్ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్దకు వచ్చి అర్థరాత్రి హంగామా సృష్టించారు. తనపైన, తన కుటుంబ సభ్యులపైన అసత్య, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ ఈడ్పుగంటి శ్రీనివాస్ పై మండిపడ్డారు. ఈడ్పుగంటి శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని చింతమనేని ప్రభాకర్ తో పాటు ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. అయితే ఈడ్పుగంటి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు వచ్చారు. మరొకవైపు ఈడ్పుగంటి శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ అంటే జిల్లా పార్టీ నేతలు. చింతమనేని ప్రభాకర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఆయనపై చర్య తీసుకున్నామని తెలిపారు. చింతమనేని ప్రభాకర్ ను కంట్రోల్ చేయకపోతే రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి కష్టాలు తప్పవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

