తిరుమలలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. తిరుమల రెండో కనుమ దారిలో ఎలుగుబంటి తిరుగుతున్నట్లు భక్తులు కనుగొన్నారు. ప్రతి రోజూ తిరుమలకు కాలినడకన స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భక్తులు కాలినడకన వెళ్లే సమయంలో ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
రెండో కనుమ దారిలో
రెండో తిరుమల కనుమ దారిలో ఎలుగుబంటి సంచరిస్తుంది. నిన్న రాత్రి వినాయక ఆలయం వద్ద సంచరించగా, ఎలుగుబంటి తినుబండారాల కోసం చెత్త కుండీల వద్ద తిరుగుతూ కనిపించింది. దాంతో ఎలుగుబంటిని చూసి తీవ్ర భక్తులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో శాఖతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కాలినడకన వచ్చే భక్తులు గుంపులుగా రావాలని కోరుతున్నారు.

