నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ సమావేశంలో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంపై ప్రధాని మంత్రులతో చర్చించనున్నారు. హోర్ముజ్ జలసంధితో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశంలోనూ పెట్రోలు, డీజిల్, సీఎన్జీ ధరలను పెంచుతూ చమురు సంస్థ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులతో చర్చించి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాలని మంత్రులకు ప్రధాని దిశ నిర్దేశం చేయనున్నారు

