ఆంధ్రప్రదేశ్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి కోటరీ గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. ఆయన కూడా మాట మార్చడంలోనూ, మడమ తిప్పడంలోనూ ఆరితేరినట్లు కనిపిస్తుంది. తన తండ్రి వైఎస్ రెడ్డి బాటలో నడుస్తున్నట్లు రాజశేఖర్ చెప్పడానికి ఆచరణలో అది కనిపించడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వరసగా మాట మారుస్తున్న జగన్ కు విశ్వసనీయత లేదన్న అధికార పార్టీ నేతల విమర్శలను ఎవరైనా అంగీకరించాల్సిందే. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ రాజధాని అమరావతిని నాడు సమర్థించారు. అసెంబ్లీ వేదికగానే అమరావతిలో రాజధాని నిర్మాణం తన అంగీకారాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో విడిపోయిన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అవసరమని కూడా జగన్ అన్నారు.
కానీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సులవుగా మాట మార్చారు. కేవలం అమరావతిలోనే అభివృద్ధి జరిపితే మిగిలిన ప్రాంతాలు అన్యాయమైపోతాయని, అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలును మూడు రాజధానులుగా అభివృద్ధి చేశారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసి చెప్పి అదే నినాదంతో 2024 ఎన్నికలకు జగన్ వెళ్లి బోల్తా పడ్డారు. 2024 ఎన్నికలలో పదకొండు స్థానాలు దక్కి ప్రతిపక్ష హోదా కూడా అధికారికంగా దక్కించుకోలేకపోయారు. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనను నాడు మూడు ప్రాంతాల ప్రజలు సమర్థించలేదన్న విషయాన్ని గుర్తించిన జగన్ మళ్లీ మాట మార్చారు.
ఇప్పుడు అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదంటూనే వైఎస్ జగన్ అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రమే వ్యతిరేకం. ఇప్పటికే సంపద సృష్టిస్తున్న నగరాలు మావిగన్ పేరును తెరపైకి తెచ్చారు. అమరావతి ఎప్పటికీ సంపద సృష్టించలేదని, వంద సంవత్సరాలు దాటిన కష్టమేనని చెప్పుకొచ్చారు. మావిగన్ అనేది 60 లక్షల జనాభా ఉన్న ప్రాంతమని, అమరావతిలో కేవలం 29 గ్రామాల ప్రజలు మాత్రమే ఉన్నారని కొత్త నినాదం అందుకుంది. 9,536 చదరపు చదరపు విస్తీర్ణం మావిగన్ అని, అమరావతి కేవలం 217 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. ఇది వినేవారికి మరో రాజకీయ అంశంగానే చూస్తారు. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలతోపనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ మావిగన్ ప్రతిపాదనతో ఎన్నికలకు వెళితే జగన్ అధికారంలోకి రాగలరా? అనే సందేహం వైసీపీ నేతల్లోనే వ్యక్తమవుతుంది.

