– ప్రకటన –
ఐదు ప్రొఫెషనల్ కోర్సులకు యూజీసీ ఆమోదం
ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలకు సువర్ణావకాశం
రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర : వీసీ ఘంటా చక్రపాణి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
దూరవిద్య ద్వారా ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) మరో ముందడుగు వేసింది. విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) నుంచి ఐదు కొత్త కోర్సులకు ఆమోదం లభించింది. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు, సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్న వారికి ఈ కోర్సులు ఎంతో కొంత ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వర్సిటీలో అనేక సంస్కరణలు చేస్తూ దూరవిద్యను అన్ని వర్గాలతోపాటు ఆదివాసీలకు, ట్రాన్స్ జెండర్స్ కూ చేరువ చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ కోర్సుల వల్ల కలిగే ప్రయోజనాలను ఏర్పాటు చేశారు. ఈకోర్సుల వల్ల రాష్ట్రంలో ఆయా రంగాల్లోని వారికి నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.
వీరికి ఎంతో ప్రయోజనం
ఎంఏ. ఎడ్యుకేషన్, ఎమ్. స్కూల్ అడ్మినిస్ట్రేషన్, బి.ఎడ్. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఎంతో కొంత ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే తమ అర్హతలను పొందడానికి, పాఠశాల నిర్వహణలో శిక్షణ పొందడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించే నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కోర్సులు బాగా ఉపయోగపడుతున్నాయి. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలోనే తెలంగాణ విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్ డబ్లూ), ఎం.ఎస్సీ. జాగ్రఫీ కోర్సులు ఎన్జీఓలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొందొచ్చని తిరిగి సొంతంగా ఎన్జీఓ ఏర్పాటు చేసుకొని సమాజానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టొచ్చు.
త్వరలో అడ్మిషన్స్ వివరాలు..
యూజీసీ కొత్తగా ఆమోదం తెలిపిన ఈ కోర్సులకు కనీస విద్యా అర్హతలు, అడ్మిషన్ విధానం, ఫీజు వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో కూడిన అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విశ్వవిద్యాలయం త్వరలో విడుదల చేయనుంది. తాజా సమాచారం కోసం విద్యార్థుల విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించాలని, లేదా హెల్ప్ డెస్క్ 040 – 23680 333 / 555 లో సంప్ర దాయించాలని సూచించారు.
యూజీసీ ఆమోదించిన కొత్త కోర్సులు
ఎం.ఏ. ఎడ్యుకేషన్, ఎం.ఏ. ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్ డబ్లు), ఎం.ఎస్సీ. (జాగ్రఫీ)చ బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్). ఈ కోర్సులకు ఆమోదం లభించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది ఘంటా చక్రపాణి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓ.డి.ఎల్.) విధానంలో అభ్యసిస్తూ తమ నైపుణ్యాన్ని అభివృద్ధిపర్చుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, ఐ.ఏ.ఎస్. ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. “రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు మరింత మెరుగు పరచడానికి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక విద్యా కార్యక్రమాలు అవసరం” అని యోగిత రాణా సూచన మేరకు ఈ కోర్సులను రూపొందించామని వీసీ తెలిపారు.
– ప్రకటన –

