Published on: 7:42 pm, 17 జూలై 2026
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుస్తుంది. ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తెలుగులో ఈ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఇంకా థియేటర్లలో ఒక మోస్తరుగా ఆడుతున్న సమయంలోనే ముందు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. జియో హాట్ స్టార్ నిన్న అర్ధరాత్రి నుంచి ‘మా ఇంటి బంగారం’ను స్ట్రీమ్ చేస్తోంది. ఐతే థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లు.. డిజిటల్ వెర్షన్ చివర్లో ఉన్న వివాదస్పద టైటిల్ కార్డ్ మిస్ అవుతోంది.
‘మా ఇంటి బంగారం’ థియేటర్ వెర్షన్ చివర్లో ‘FUSN, IYKYK’ అని ఎండ్ టైటిల్స్‌లో వేశారు. ఇది ఈ చిత్ర సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌కు కౌంటర్ అని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ చిత్రం పాటల పని మాత్రమే పూర్తి చేసిన సంతోష్.. బీజీఎం విషయంలో హ్యాండ్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు హడావుడిగా ఇద్దరు ముగ్గురు వేరే సంగీత దర్శకులతో పని చేయించుకోవాల్సి వచ్చిందట.
ఈ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ టీం.. సంతోష్ నారాయణన్‌కు కౌంటర్ ఇస్తూ ఎండ్ టైటిల్స్‌లో ఆ మెసేజ్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. ఐతే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో దీని మీద పంచాయితీ జరిగి ఉండొచ్చు. ఇరు వర్గాలు మాట్లాడుకుని వివాదానికి తెరదించి ఉండొచ్చు. లేదా ఆల్రెడీ జరిగిన రచ్చ చాలని టీం డిజిటల్ వెర్షన్లో ఈ మెసేజ్‌ను తీసేసి ఉండొచ్చు. ఈ మీద ‘మా ఇంటి బంగారం’ టీం కానీ.. సంతోష్ నారాయణన్ కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రమోషన్లలో సంతోష్ ఎక్కడా పాల్గొనలేదు. అతడి పని గురించి టీంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడలేదు.

