గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను కుడిపేస్తున్న పర్సంటేజ్ వివాదం ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాల లీకులు, డ్రాఫ్ట్‌లు ఇండస్ట్రీ వర్గాల్లో గందరగోళం సృష్టించిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు రంగంలోకి దిగారు. ఆయన సంతకంతో కూడిన ఒరిజినల్ ప్రెస్ నోట్‌ను ఛాంబర్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు నా సంతకం లేకుండా ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొట్టిన లేఖలన్నీ ముమ్మాటికీ ఫేక్ అన్న సురేష్ బాబు సంతకంతో అఫీషియల్ ప్రెస్ నోట్ ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసింది.
ఇండస్ట్రీలో లా రన్ కోసం తీసుకురావాలని కొత్త పర్సంటేజ్ సిస్టమ్‌పై కూడా కాలపరిమితిని నిర్దేశించారు. నిర్మాతలు సమర్పించిన అన్ని రకాల షరతులు, కండిషన్లపై కమిటీ కూలంకషంగా చర్చించనుంది. రాబోయే తదుపరి భారీ సినిమా విడుదలకు ముందే లేదా 2026 జూన్ చివరి నాటికి ఈ సరికొత్త పర్సంటేజ్ని పూర్తి చేయడానికి డెడ్‌లైన్ విధించబడింది. ఫిల్మ్ ఛాంబర్ అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసినప్పటికీ, ఈ అంశంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ విడుదల చేసిన లేఖలో ఉన్న ప్రతీపని తాము తెలంగాణ ఎగ్జిబిటర్ల ముందుకు తీసుకెళ్తామని, వారందరితో లోతుగా చర్చించి, వారి అభిప్రాయాలు మరియు గ్రౌండ్ రియాలిటీలను తీసుకున్న తర్వాత తమ తుది నిర్ణయాన్ని అధికారికంగా కోరుతున్నామని శ్రీధర్ తెలిపారు. దీంతో, ఛాంబర్ అధికారికంగా లైన్ క్లియర్ చేసిన, రాబోయే రోజుల్లో తెలంగాణ థియేటర్ ఓనర్ల అంతర్గత సమావేశం ఈ వివాదంలో ఎలాంటి మలుపు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

