– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : పదవుల కోసం గాంధీ భవన్‌కు వచ్చే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. సర్ పై నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపాటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావొద్దన్నారు. కొందరు నేతలు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్చార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సర్‌పై సమీక్షలు నిర్వహించారని తెలిపారు. ”119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్‌పై 489 భేటీలు జరిగాయి. వెనుకబడిన నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికైనా స్పందించాలి.
చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు. పదవుల కోసం వచ్చే వారికి గాంధీభవన్‌లో అపాయింట్మెంట్లు ఇవ్వొద్దు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా సమీక్షలు జరపాలి. ఇన్ఛార్జిలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ పరంగా సర్ ఇన్ఛార్జిలుగా ఉన్న వారు మెరుగైన సమన్వయం చేసుకోవాలి. బీఎల్వోల నివేదికల కంటే బీఎల్ఏ ల రిపోర్టులను పరిశీలించాలి. బిఎల్వోల రిపోర్టులపై మాత్రమే కఠిన చర్యలు ఉంటాయి.
పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నేతలు సమర్థంగా ఉపయోగించాలి. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి.. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో ఉండాలి. సర్‌కు నియమించిన పార్టీ ఇన్‌ఛార్జిలు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాం. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క బాధ్యతలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీతో ఫొటో దిగే అవకాశం ఉంటుంది” అని సిఎం తెలిపారు.
– ప్రకటన –

