బ్లాక్‌బస్టర్ హిట్లు, స్టైలిష్‌గా గాల్లోకి ఎగరేసే సన్‌గ్లాసెస్, థియేటర్లలో మార్మోగే ఈలలు, గోలలు… వీటన్నింటికీ ముందు బెంగళూరు సిటీ బస్సులో టికెట్లు కొడుతూ ఒక సాధారణ యువకుడు కనిపించేవాడు. అతని పేరు శివాజీరావు గైక్వాడ్. ప్రస్తుతం ఆ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టలేరు, కానీ రజనీకాంత్ , తలైవర్ అంటే ప్రపంచమే ఊగిపోతుంది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ లెజెండ్ తొలి అడుగుల గురించి ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది.
నెల జీతం రూ.275 రూ. 250 కోట్లతో..
ఇటీవల నెట్లో వైరల్ అవుతున్న బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (BTS) ఐడెంటిటీ కార్డ్ రజనీ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. 1971లో జారీ చేయబడిన ఈ పాత ఐడీ కార్డులో తలైవర్ తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ తో బాస్ కండక్టర్‌గా కనిపించారు. అయితే, ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన అసలు విషయం ఏంటంటే… ఆ రోజుల్లో ఆయన నెల జీతం అక్షరాలా రూ. 275 మాత్రమే.. ఒకప్పుడు బెంగళూరులో రూట్ నంబర్ 10A బస్సులో టికెట్లు ఇస్తూ, నెలకు రూ. 275 సంపాదించిన ఆ యువకుడే.. భవిష్యత్తులో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్ స్టార్ అవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇవాళ ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
అప్పట్లో వందల్లో జీతం తీసుకున్న తలైవర్, ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ‘జైలర్’, ‘కూలీ’ సినిమాలకు ఆయన తీసుకున్న పారితోషికం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికం. రూ. 275 ఎక్కడ? రూ. 250 కోట్లు ఎక్కడ? ఇది కదా అసలైన ‘రజనీజం’ అంటే.. అని కొనియాడుతున్నారు.
►ఇంకా చదవండి | లోకేష్ కనగరాజ్: లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ పోస్ట్
తొలి చిత్రంతోనే..
సినిమాలపై ఉన్న పిచ్చితో రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇన్ డిగ్రీలో చేరారు. అక్కడ ఆయనలోని నటనను, స్టైల్‌ను ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ పేర్కొన్నారు. 1975లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో రజనీకి బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. రూ. 275 జీతం నుంచి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితా వరకు… రజనీకాంత్ సాధించిన ఎదుగుదల ఒక అద్భుతం.
లెజెండ్స్ అందరూ సున్నా నుంచే మొదలు..
ఈ వైరల్ ఐడీ కార్డ్ కేవలం ఒక పాత కాగితం కాదు. కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తుకైనా ఎదగొచ్చని నిరూపించే ఒక నిదర్శనం. నేడు కోట్లాది మంది గుండెల్లో ‘తలైవర్’గా నిలిచిన రజనీకాంత్ ప్రయాణం, ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ నిలుస్తోంది. ఏ లెజెండ్ అయినా ఎక్కడో ఒకచోట సాదాసీదాగానే మొదలవుతుంది నిజానికి ఈ ఫోటోనే ఒక సజీవ సాక్ష్యం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఒక బస్ కండక్టర్ బస్ టికెట్ కొడతాడు. ఈ బస్సు కండక్టర్ కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టాడు. తనెవరో తన ఐ డి కార్డ్ ఎలా ఉందో చూడండి. @రజినీకాంత్ #సూపర్ స్టార్_రజినీకాంత్ pic.twitter.com/VWjt3hyN4V
— శివమల్లల (@SivaMallala) మే 29, 2026

