– ప్రకటన –
నవతెలంగాణ – నాచారం
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలకమైన నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ఎం నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రముఖ అతిథిగా హాజరైన బండా లక్ష్మారెడ్డి రూ.37.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజలు చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషకరమని తెలియజేసారు. చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. సుందరీకరణలో భాగంగా ఆధునిక వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, హరితవనాలు, సిట్టింగ్ ఏరియాలు, అలంకార లైటింగ్, పిల్లల ఆట స్థలాలు, ఫుడ్ కోర్టులు మరియు పర్యావరణ సౌకర్యాలను ఏర్పాటు చేయడాన్ని వివరించారు.
ఈ ప్రాజెక్టు తర్వాత చెరువు పరిసర ప్రాంతం నగరవాసులకు ప్రధాన ఆకర్షణీయంగా మారుతుందని ఆయన అన్నారు. చెరువు పరిరక్షణతో పాటు వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, భూగర్భ జలాల సంరక్షణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటీ నగర్ ప్రాంత రూపురేఖలు మారిపోవడంతో పాటు స్థానిక ఆస్తుల విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన, ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జెన్ శేఖర్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఉన్నారు. చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమైనందుకు ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
– ప్రకటన –

