శాన్ డియాగో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శాన్ డియాగో ఓ మసీదులో ఇద్దరు టీనేజర్లు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని… ఆ తర్వాత కాల్పులు జరిపిన వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్‌పై జరిగిన ఈ దాడిని ద్వేషపూరిత నేరంగా దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ డియాగో పోలీస్ చీఫ్ స్కాట్ వాల్ చెప్పారు.
శాన్ డియాగో మసీదు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన.. “ఇది ఒక భయంకరమైన పరిస్థితి, మేము చాలా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాము” అని చెప్పారు.

