అల్లు అర్జున్: గత రాజకీయాల్లో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మామయ్య చంద్ర శేఖర్ అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రానికి చాలా సపోర్టు ఉంది , రీసెంట్ గా ముంబై లో అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ వంటి వారితో కూడా చర్చలు జరిగాయి , ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించిన అల్లు అర్జున్ టీం , అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ వ్యక్తిగత మ్యానేజర్ శరత్ చంద్ర కూడా ఈ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ తేల్చి చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ప్రస్తుత ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది. ఇండియా లో మోస్ట్ బిజీ గా ఉండే హీరోల్లో ఆయన ఒకరు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు , ఇలాంటి పీక్ సినిమా కెరీర్ ని వదిలి ఆయనను రాజకీయాల్లోకి వస్తారు?, అంత అవసరం ఏముంది? , ఈమధ్య విచిత్రంగా కొన్ని వార్తలు కూడా చూశాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని , ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా ఒక కొత్త పార్టీతో రాబోతున్నారని పుకార్లు పుట్టించారు. అది చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది. ఇలాంటి కథనాలు క్రియేట్ చేసేవాళ్లకు ఎక్కడి నుండి ఇలాంటి ఆలోచనలు వస్తాయో అర్థం అవ్వడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని స్పష్టం చేశారు శరత్ చంద్ర. కనీసం ఇప్పటికైనా ఈ ఊహాగానాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ముంబై లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రధానంగా జరుగుతూనే ఉంది . ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా ముంబైలో షూట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ ఈ రెండు సినిమాల పైనే ఉంది. ఆ తర్వాత ఆయన మలయాళం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో ఒక సినిమా చేయనున్నారు.

