నవతెలంగాణ-మద్నూర్
గత వారం మండల పరిధిలోని ఫర్టిలైజర్ ఉత్పత్తులను ఏఓ రాజు సందర్శించి, రైతులకు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, అమ్మిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రశీదు అందించిన హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే మండల ఫర్లైజర్ దుకాణ యజమానులు అధికారులను తుంగలో తొక్కి, రైతులకు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నారు. ఈ మోసం ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో ఒరిజినల్ రశీదులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై అమ్మిన డేట్, రైతు చెల్లించిన అమౌంట్ వేసి ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. యూరియా ఆన్లైన్లో అమ్ముతూ.. ప్రతి బస్తాపై రూ.50 అదనంగా వసూలు చేసి నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఓ రాజును నవతెలంగాణ వివరణ కోరగా..రాతపూర్వకంగా రైతులు ఫిర్యాదు చేస్తే టిలైజర్ దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.
పోస్ట్ చిత్తు కాగితాలే రశీదులు.! మొదట కనిపించింది నవతెలంగాణ.

