అస్సాం అమ్మాయి తెలుగు పాట పాడింది: మంత్రి నారా లోకేష్ కు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉంటుంది. పైగా ఆయన క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అధికారుల పనితీరులో లోపం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పనితీరు మార్చుకోవాలని సూచించారు. అంతేతప్ప అనవసరమైన విషయాలలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితుల మీద విపరీతమైన కమాండింగ్ ఉంది. అందువల్లే పని చేయించుకునే విధానంలో ఆయన సానుకూలంగా మాత్రమే పాటిస్తుంటారు. అందుకే నారా లోకేష్ ప్రజల మెచ్చిన మంత్రి అయ్యారు. మంగళగిరి ప్రజల అభిమాన నాయకుడయ్యారు.
సోషల్ మీడియాలో నారా లోకేష్ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన వస్తువులు.. తాను మెచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా.. ఇటువంటి వినూత్నమైన అంశాలు కూడా పంచుకుంటారు. అందుకే ఆయన అందరికీ నచ్చుతారు. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.
ఆ వీడియోలో ఒక బాలిక పాట పాడుతోంది. ఆ బాలిక ముఖ కవళికలను చూస్తే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి అసబ్ రాష్ట్రానికి చెందిన అదితి. ఈమె పుట్టింది అస్సాం రాష్ట్రంలో కూడా.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. పైగా తెలుగులో గీతగోవిందం అనే సినిమాలో వచ్చిందమ్మా అనే పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట విన్న నారా లోకేష్ ఒక్కసారిగా ఆనంద పరశుడైపోయారు. అంతేకాదు ఆ పాట పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“ఆ అమ్మాయి గొంతు బాగుంది. ఆ పాట వింటుంటే ఆనందంగా.. భిన్నభాషలకు.. బిందమైన సంస్కృతులకు మన దేశం పుట్టిల్లు. ఇన్ని రకాల భిన్నత్వాలు మన దేశ ప్రజల హృదయం ఒక్కటిగానే ఉంటుంది. సంగీతం.. సంస్కృతి.. దేశ రాష్ట్ర ఏకం. ఇవి రాజకీయాల కంటే కూడా లోతుగా మనకు మధ్యబంధాలను ఏర్పరుస్తాయి.
నారా లోకేష్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత.. ఆదితి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. అసలు ఆమె ఎవరు.. నేపథ్యం ఎక్కడ.. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా పాడగలుగుతుంది.. ఆమె గొంతు చాలా అందంగా ఉంది.. సినీ అవకాశాలు ఇస్తే ఆమె స్థాయి మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
గీత గోవిందం నుండి “వచ్చిందమ్మా” అని ఒక అస్సామీ పిల్లవాడు చాలా ఆనందంతో పాడటం నిజమైన ఆత్మ. #భారతదేశం.
వివిధ భాషలు. విభిన్న సంస్కృతులు. ఒక్క గుండె చప్పుడు.
ఇలాంటి క్షణాలు మనకు గుర్తు చేస్తాయి #సంగీతం మరియు సంస్కృతి మన దేశాన్ని రాజకీయాల కంటే చాలా లోతుగా ఏకం చేస్తుంది. pic.twitter.com/swUTQu4owi
– లోకేష్ నారా (@naralokesh) మే 16, 2026

