రాష్ట్రంలో అటవీ సంపదను కూడా కాపాడుకోవడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో పులుల సంతతి తగ్గిపోతోందని.. వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నాను. ఈ క్రమంలో ఆరు ఆడపులులను పంపిస్తే.. రాష్ట్రంలో పెరిగే పుల సంతతిని.. దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అవకాశం ఉంది.
రాష్ట్రంలోని నల్లమలలో పులుల సంచారం ఎక్కువ. అయితే.. గత కొన్నాళ్లుగా వీటి సంతతి తగ్గుతోంది. అడవుల ఆక్రమణ, రహదారుల నిర్మాణం.. వాతావరణలతో పులుల సంఖ్య తగ్గిపోయిందని ప్రస్తుతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ పర్యావరణలో ఉన్న పవన్ కల్యాణ్.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై ఆయన చర్చించారు.
ఏపీలోని పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో బేస్ క్యాంపులు పెంచాలని. బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం కేంద్ర సహకారానికి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులను అరికట్టడం కోసం . ‘హనుమాన్’ ప్రాజెక్ట్ చేపట్టిన విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో దాని వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. అదేసమయంలో అడవుల్లో బేస్ క్యాంపుల నిర్మానం కోసం.. కేంద్రం నుంచి నిధులు ఉంటాయి.
ఇక, మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడ పులులను ఏపీకి పంపించాలని నిర్ణయించారు. తద్వారా పర్యావరణ పరక్షణలో భాగంగా పులుల సంతతి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కాగా.. గతంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన విషం. వీటి ద్వారా అడవుల’పై దాడులు చేసే ఏనుగుల’ను తరిమి కొట్టడంతోపాటు.. ఏనుగులను హింసించకుండా వన్యప్రాణి రక్షణకు పవన్ ప్రయత్నం చేశారు.

