రామ్ చరణ్ పెద్ది సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారిలో రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నాడు. రాజమౌళి తో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ క్రేజ్ దక్కింది. ఇక ఇలాంటిదే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా మూడు స్పోర్ట్స్ లను హైలైట్ చేస్తూ సినిమానైతే తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నర్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ పరిశీలన ట్రైలర్ లో స్థాపించబడింది.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇంతముందు ఇలాంటి పాత్రను ఎప్పుడూ పోషించలేదు. కాబట్టి అతనికి ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాని ప్రధానంగా మూడు కథలను కాపీ చేసి ప్రదర్శించారట. ఆ కథలు ఏంటి అంటే అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లగాన్’ సినిమాలో క్రికెట్ పాయింట్ ను సాధించింది.
అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ ఫైట్ ని ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గా రాసుకున్నారు. ఇక దానితోపాటుగా ‘బాగ్ మిల్కా బ్యాగ్’లోని రన్నింగ్ రేస్ ని సైతం ఈ సినిమాలో భాగం చేస్తూ చివర్లో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఈ మూడు కథలను బేస్ చేసుకొని బుచ్చిబాబు ఈ కథనైతే రెడీ చేసినట్లు తెలుస్తుంది.
మరి రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదంటే కాపీ సినిమాలతో వస్తుంది కాబట్టి ఈ సినిమా భారీ డీలా పడిపోతుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…గత సంవత్సరం రామ్ చరణ్ చేసిన గేమ్ చెంజర్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించి కొంతవరకు డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది…

