భారత మహిళలు vs దక్షిణాఫ్రికా మహిళలు: టి20 వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. అదే ఊపులో నెదర్లాండ్ పై కూడా బ్రహ్మాండమైన గెలుపును దక్కించుకుంది. ఫలితంగా రెండు విజయాలతో పటిష్ట స్థితిలో ఉంది. ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వెళ్లాలంటే.. కప్ మీద ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే సౌత్ ఆఫ్రికా గండాన్ని దాటాలి.
సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా నేడు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లలో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్.. బ్యాటింగ్ తో అదరగొట్టే సత్తా వీరి సొంతం. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా గెలుపు కోసం తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రమాదకరంగా మారింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ చెట్టును రెండు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చూపించింది.. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొడితే.. ప్రస్తుతానికి ఇబ్బంది తప్పదు.
ఈ మ్యాచ్ మాన్ చెస్టర్ వేదికగా జరుగుతుంది. స్పిన్ బౌలర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ.. మిగతా స్పిన్నర్లు గనుక సత్తా చూపిస్తే భారత్ మ్యాచ్లో అనుకూల ఫలితం సాధించే అవకాశం ఉంది.. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు సమిష్టిగా ఆడుతున్నారు. ఫలితంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. కేవలం ఒక ప్లేయర్ మీదనే.. ఒక్క బౌలర్ మీదనే జట్టు ఆధారపడడం లేదు. దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అనగానే టీమ్ ఇండియాకు ఒత్తిడి సహజంగానే ఉంటుంది. దానిని పూర్తి ప్లేయర్లు అధిగమించాలి.
అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో ఆడాలి. అందరూ విజయమే లక్ష్యంగా ఆడితే హాజరుకు తిరుగుండదని మాజీ ప్లేయర్లు చూస్తున్నారు.. చూడాలి మరి హర్మన్ సేన ఏం చేస్తుందో. మందాన, జెమీమా, షఫాలీ వర్మ వంటివారు మెరుగ్గా ఆడితే బాగుండదు. ఒకవేళ ముందుగా బ్యాటింగ్ గనక చేస్తే భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ లోనూ సత్తా చూపించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో అరుంధతి రెడ్డికి విశ్రాంతి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

