“ఇరాన్‌ను మసి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్య క్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక’, చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, ఆ దేశంతో చర్చలు అనే మాట కూడా ఎత్తేది లేదన్నారు. ఇరాన్ పాలకులను ఈ సందర్భంగా ఆయన క్రూరులుగా అభివర్ణించారు. వారు.. ఈ ప్రపంచంలో జీవించేందుకు అర్హులు కాదన్నారు. ఇకపై ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఇరాన్‌పై దాడి చేయనున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలోని హోర్ముజ్ జల సంధిగుండా అమెరికా నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే.. ఒప్పందం అడ్డు పెట్టుకుని తమ జలాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌకపై దాడి చేసి.. వాటిని నీటమునిగేలా చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ట్రంప్.. అగ్రహోదగ్రులయ్యారు. ఇరాన్‌ను క్షమించేది లేదని చేర్చా రు. శాంతి ఒప్పందం కూడా ముగిసింది, ఇక, చర్చలు అనే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
“ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తున్నారు. చర్చల పేరుతో టైం వృథా చేస్తున్నారు. ఇకపై ఎలాంటి చార్యలు ఉండవు. ఆదేశాన్ని నాశనంచేస్తాం. బుగ్గి చేస్తాం. ఏరుకునేందుకు ఎముకలు కూడా లేకుండా చేస్తాం.” అని హెచ్చరించారు. ఆయన హెచ్చరించే సరికే.. అమెరికా సైనికులు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేదన్నారు.
ప్రపంచం గగ్గోలు!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు మరోసారి గగ్గోలు పెట్టాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి దారిలోకి వస్తోందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్‌పై అమెరికా విరుచుకుప డడం.. ప్రతిగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేయడంతో హోర్ముజ్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడు తోంది. ఫలితంగా మరోసారి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం.

