ఐపీఎల్ 2025, 2026 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని గుర్తించిన సెలెక్టర్లను పట్టించుకోవడం లేదు. వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ రజత్ పాటిదార్‌ను భారత సెలెక్టర్లు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. అద్వితీయమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు భారత జట్టులో అవకాశం ఇవ్వడం లేదు.
ఇటీవల జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసినా.. ఒక్క ఆర్సీబీ ఆటగాడికి కూడా అవకాశం దక్కలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పాటు మిడిలార్ బ్యాటింగ్ బలాన్ని పెంచేందుకు రజత్ పాటిదార్‌ను జట్టులోకి ఎంపిక చేసిన మాజీ క్రికెటర్లు.. సెలెక్టర్లు పట్టించుకోలేదు.
వయసు ఎక్కువనే కారణంతో..
ఐపీఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన బౌలింగ్‌తో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా విస్మరించారు. రజత్ పాటిదార్ వయసు 31 ఏళ్లు కావడం లేదు, భువనేశ్వర్ 36 ఏళ్ల వయసులో ఉండటంతో ఈ ఇద్దర్ని పక్కనపెట్టారు. టీ20లకు యువకులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని సెలెక్టర్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
19 వికెట్లు తీసినా..
భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఆర్సీబీ అద్భుత ప్రదర్శన కనబర్చిన రసిక్ దార్ సలామ్‌ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. 26 ఏళ్ల రసిక్ సలామ్.. ఐపీఎల్ 2026 సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయినా సెలెక్టర్లు రసిక్ దార్ సలామ్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు.
గతంలో ప్రణాళికల్లో భాగంగా ఉన్న దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ, వెంకటేశ్ అయ్యర్‌లను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. భారత జట్టు టీ20 ఎంపికకు ఐపీఎల్‌నే ప్రమాణికంగా తీసుకునే సెలెక్టర్లు.. ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌లో ఒక్కరికి అవకాశం ఇవ్వకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
గంభీర్ కారణంగానే..
అయితే ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే ఆర్సీబీకి అవకాశాలు దక్కడం లేదని ఆ ఫ్రాంచైజీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ, అభిమానులతో గంభీర్‌కు ఉన్న గొడవలను మనసులో పెట్టుకొనే ఇలా చేస్తున్నాడని మండిపడుతున్నారు.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌ల కంటే రసిక్ దార్ సలామ్ మెరుగైన ప్రదర్శన చేశాడని, కానీ ఆర్సీబీ ప్లేయర్‌ని పక్కనపెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు. హర్ష్ దూబే కంటే కృనాల్ పాండ్యా మెరుగైన ప్రదర్శన కనబర్చాడని, కానీ సెలెక్టర్ అతనిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, శివమ్ దూబే, సూర్యాంష్ షెడ్జే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తీ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
కథనం మొదట ప్రచురించబడింది: గురువారం, జూలై 9, 2026, 13:00 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 9, 2026

