ఐఓఎల్ అధ్యక్షులు శీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జూన్ 7వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహించబడే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యువకుల ఫౌండేషన్ అధ్యక్షులు శీలా నాగేంద్ర, ఆదివారం కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ ఆవరణములో వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మండూరి రామయ్య కీర్తిశేషులు మండూరి నాగరాజు జాపకార్థం కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ, నేత్ర జ్యోతి గంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో చికిత్స పొందింది. శిబిరానికి వచ్చు కంటి రోగుల ఆధార్ కార్డ్ ,ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ తో పాటు చిరునామా తీసుకొని రావలెనని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ధర్మవరం పరిసర ప్రాంతాల ప్రజలకు కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. కావున ఈ పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, కంటి వెలుగును ప్రసాదించాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో రాధాకృష్ణ, సుబ్బారావు, చాంద్ భాషా, పోలా ప్రభాకర్ డాక్టర్ అయ్యారు.

