ఉత్తర ప్రదేశ్ పోలీసు పరీక్ష : శీర్షిక చదివి ఇదేదో పెద్దల కంటెంట్ అనుకునేరు. బూతు పదమని అనుకునేరు. అలా రాయాల్సిన ఉద్దేశం మాకు లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ముమ్మాటికి చదవాల్సిన కథనం. అర్థం చేసుకోవాల్సిన విషయం.
మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం అక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక పరీక్షలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి సహజంగానే నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగానే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. ఇప్పటికే శారీరక దారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. రాత పరీక్షలు జరుగుతున్నాయి. రాత పరీక్షలను అత్యంత పకడ్బందీగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల తీరు ఆందోళన కలిగిస్తోంది. విమర్శలకు దారితీస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లోని జౌన్ పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్ష నిర్వహించిన పరీక్షలలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అక్కడ డిటెక్టర్‌తో ప్రతి అభ్యర్థిని తనిఖీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి తన అండర్వేర్లో ఫోన్ పెట్టుకుని వచ్చాడు. అది కాస్త డిటెక్టర్ ద్వారా చేసిన తనిఖీల్లో బయటపడింది. దీనితో అభ్యర్థులను ముందుగా అండర్వేర్లో డిటెక్టర్ పెట్టి పరీక్షిస్తున్నారు. ఆ తర్వాత దానిని నోట్లో కూడా పెడుతున్నారు. అండర్వేర్ నుంచి నోరు వరకు దేనిని వదలకుండా డిటెక్టర్ పెడుతుండడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి నోరు మెదపకపోయినప్పటికీ.. ఉద్యోగం కావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానిని తట్టుకుంటున్నారు.
“ఉద్యోగం సాధించాలంటే కష్టపడాలి. అందులో తప్పులేదు. కానీ ఇలా అండర్వేర్లో డిటెక్టర్ పెట్టి దాన్ని మళ్ళీ నోట్లో పెడితే దాన్ని ఏమనుకోవాలి.. అసలు ఇలా తనిఖీ చేస్తారా.. దీన్ని తనిఖీ అంటారా.. ఇంతగనం ఇబ్బంది పెడితే ఎలా రాయాలి. పరీక్ష రాయడానికి వచ్చిన వారంతా పేద, మధ్య తరగతివారే.
ఉత్తరప్రదేశ్‌లో UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం అధికారులు ఎంట్రీ ప్రోటోకాల్‌ను పెంచారు. pic.twitter.com/m70eAHjT3v
— బ్రూట్ ఇండియా (@BrutIndia) జూన్ 12, 2026

