ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇది షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా లభిస్తున్నాయి. దీని కారణంగా వాతావరణంలో వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడాలని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడ జీర్ణక్రియను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.ఇది చర్మం మెరుపును పెంచుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఏంటో మేలు చేస్తుంది. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది.
ఉల్లికాడలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధి బారిన పడకుండా సమస్య తగ్గుతుంది. వీటిల్లోని ఫొలెట్‌లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. ఉల్లికాడలలో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్‌లు అధికంగా లభిస్తాయి. ఉల్లికాడలలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మంగనీసు, ఫైబర్ ఉంటాయి. ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రిస్తూ సహాయ పడుతుంది. ఈ విధంగా ఉల్లికాడలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పోస్ట్ ఉల్లికాడలతో ఆరోగ్యం.. మొదట కనిపించింది నవతెలంగాణ.

