తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ కోసం ఎగ్జిబిటర్లు చేస్తున్న పోరాటం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిందే. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ విషయంలో చాలా పట్టుదలతో కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా ఏదో ఒక హామీ ఇచ్చి సమస్యను వాయిదా వేస్తే ఊరుకోమని.. వెంటనే పర్సంటేజీ అమలు చేయాల్సిందేనని.. రాబోయే పెద్ద సినిమా ‘పెద్ది’కి కూడా మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు.
ఐతే కొన్ని వారాల ముందు ఎగ్జిబిటర్లు తమ బాధను వ్యక్తం చేస్తూ.. వారి మీద కౌంటర్ ఎటాక్ చేశారు నిర్మాతలు. సింగిల్ స్క్రీన్ల మెయింటైనెన్స్ గురించి విమర్శలు చేయడం, నిర్మాతల బాధలు చెప్పడం, ‘పెద్ది’ సినిమా టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారనడం ద్వారా ఈ వ్యవహారంలో పైచేయి సాధించాలని చూశారు. సమస్య తర్వాత సమస్య కోసం ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు.. సినీ పెద్దలు కలిసి మాట్లాడుకోవడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపించింది.
కానీ చర్చలు, కమిటీల నివేదికల ద్వారా మీకు న్యాయం జరగడం లేదని.. ఈ సమస్య నాన్చే ప్రయత్నంలో ఉందని అనుమానిస్తున్న ఎగ్జిబిటర్లు మళ్లీ పోరాటం ప్రారంభించారు. తమ బాధను ఇండస్ట్రీ వాళ్లకే కాక మీడియాకు, సామాన్య జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక సినిమా మల్టీప్లెక్సులో కోటి రూపాయల షేర్ సాధిస్తే పర్సంటేజీ ప్రకారం రూ.45 లక్షలు థియేటర్ యజమానికి, రూ.55 లక్షలు నిర్మాతకు వెళ్తున్నాయని.. కానీ సింగిల్ స్క్రీన్లో అంతే ఆదాయం వస్తే అద్దె రూపంలో రూ.7 లక్షలు మాత్రమే థియేటర్ యజమానికి ఇచ్చి, రూ.93 లక్షలు నిర్మాత తీసుకుంటున్న కఠిన వాస్తవాన్ని ఎగ్జిబిటర్లు మీడియా ద్వారా బయటపెట్టి అన్ని వర్గాల నుంచి సానుభూతి సంపాదిస్తున్నారు. తాజాగా ఎగ్జిబిటర్ల కష్టాలపై నందమూరి బాలకృష్ణ సైతం సింపతీ చూపించారు.
‘పెద్ది’ సినిమా ముందుంచి తమను ఇరుకున పెట్టాలని నిర్మాతలు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు నేరుగా మెగాస్టార్ చిరంజీవినే కలుస్తున్నారు. ఆయనకు సమస్య అర్థమయ్యేలా చెప్పి మద్దతు సంపాదిస్తే.. తమ సమస్య అవుతుందని. ఎలాగూ సామాన్య జనం, సోషల్ మీడియా నుంచి కూడా పెరుగుతున్న నేపథ్యంలో పర్సంటేజీకి నిర్మాతలు ఒప్పుకోక తప్పదని ఎగ్జిబిటర్లు ఆశిస్తున్నారు.

