డ్రాగన్ గ్లింప్స్: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న అత్యంత అవైటెడ్ అప్డేట్ అఫీషియల్‌గా వచ్చేసింది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #NTRNeel ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తూ.. ఈరోజు (మే 19, 2026) రాత్రి 11:52 PM IST కి ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ గ్లింప్స్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “విధ్వంస ప్రోటోకాల్ సక్రియం అయ్యే మైదానాలు ఇవి” (విధ్వంసక ప్రోటోకాల్ యాక్టివేట్ అయ్యే మైదానాలు ఇవే) అంటూ పవర్ఫుల్ లైన్లతో హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు మేకర్స్. ఈ గ్లింప్స్ కేవలం డిజిటల్‌గానే కాకుండా, ప్రపంచంలో కొన్ని థియేటర్లలో కూడా ఒకేసారి స్క్రీనింగ్ కానుండటం విశేషం. సాధారణంగా ఫస్ట్ గ్లింప్స్ అంటే నిమిషం లోపే ఉంటుంది. కానీ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం.. ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్ రన్‌టైమ్‌ను ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లలో డిజైన్ చేసినట్లు సమాచారం. అంటే.. కేవలం టీజర్ లాంటిది కాకుండా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, ఎన్టీఆర్ రగ్డ్ మాస్ లుక్‌ను కళ్లకు కట్టేలా సరికొత్త ప్రపంచాన్ని ఈ గ్లింప్స్ ద్వారా ఫ్యాన్స్‌కు పరిచయం చేయబోతున్నారట. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మోత మోగిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
భారతదేశ సరిహద్దుల (ఇండియా, చైనా, భూటాన్) నేపథ్యంలో 1969 కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్ – ఇండియా చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలజ్ అటెన్షన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో #NTRNeel, #Dragon, #JrNTR ట్యాగ్లు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
విధ్వంసం ప్రోటోకాల్ సక్రియం అయ్యే మైదానాలు ఇవి 🔥#ఎన్టీఆర్ నీల్ ఈరోజు 11:52PM ISTకి మొదటి సంగ్రహావలోకనం. pic.twitter.com/xs9SeBLvBp
— #NTRNeel (@NTRNeelFilm) మే 19, 2026

