ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో నైరుతి రుతుపవనాలను మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. సీతారామరాజు సంబంధిత ప్రాంతాలకు రుతుపవనాలు చేరే సూచనలు ఉన్నాయని వివరించారు. ఈ మేరకు ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు.పార్వతీపురం మన్యం జిల్లాలో పవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో మరిన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని. శ్రీకాకుళం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని. నైరుతి రుతుపవనాల విస్తరణతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని వివరించారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
The post ఏపీలో ఆయా ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు.. appeared first on Visalaandhra.

