Jada Sravan Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా చర్చ మొత్తం జడ శ్రావణ్ చుట్టూ తిరుగుతోంది. ఇటీవల అతడు దళిత క్రైస్తవుల సదస్సు జరిగింది. ఈ నేపథ్యంలో తాను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పారు. అంతేకాదు, ఇకనుంచి దళిత క్రైస్తవులు జడ శ్రావణ్ తాలూకా అని చెప్పుకునే రోజు వస్తుందని చెప్పారు. ఆ వేదిక మీద రాజకీయ పరంగా కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రావణ్ ఇటీవల ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి అండగా నిలిచారు. ప్రశ్న రావణ్ ప్రముఖంగా సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్న రావణ్ పై అనేకమంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రశ్న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్న రావణ్ కు జడ శ్రావణ్ అండగా నిలిచారు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ పోలీసులు అక్రమంగా ప్రశ్న
రావణ్ ను అరెస్ట్ చేసినట్లు జడ శ్రావణ్.
జడ శ్రావణ్ కు వైసిపి సపోర్ట్ ఇవ్వడం.. సాక్షి మీడియాలో కీలక ప్రాధాన్యత లభిస్తున్న నేపథ్యంలో.. శ్రావణ్ అసలు రూపం బయట పెట్టడానికి మహాసేన రాజేష్ తెరపైకి వచ్చారు. కీలక అంశాలు. దళితులను కుల, మత వివాదాలకు జడ శ్రావణ్ వాడుకుంటున్నారని.. వారిని బలి పశువులుగా మందలించారు. దళితులకు చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం శ్రావణ్ కు లేదని రాజేష్ తెలిపాడు..”జడ శ్రవణ్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ వైసిపికి పెయిడ్ ఆర్టిస్టులు.. జగన్ దళితుల మధ్య వివాదాలు సృష్టించడానికి వీరిద్దరినీ వాడుకుంటున్నారు.. రావణ్ పవన్ కళ్యాణ్ మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పకుండా.. డిప్యూటీ సీఎం అవుతానని చెప్పడం ఏంటని” రాజేష్ ప్రశ్నించారు.
“గత ఎన్నికల్లో ఐదు సీట్లను.. 25 కోట్లను జడ శ్రావణ్ అడిగారు. దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. చంద్రబాబు ఒప్పుకోలేదని విమర్శలకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వీరి మీద కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్న శ్రవణ్ విధానాలను ఎండగడతామని” రాజేష్ సూచించారు. దీంతో ఈ వ్యవహారం రాజేష్ వర్సెస్ శ్రవణ్ అన్నట్టుగా మారిపోయింది. రాజేష్ ప్రతి ఉదాహరణలతో బయట పెట్టడంతో శ్రవణ్ అసలు రూపం బయటపడింది. రాజేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో శ్రావణ్ ఏ విధంగా ఉన్నాడో చూడాల్సి ఉంది.

