ముంబయి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అదృశ్యమైన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ధంతోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సురేశ్ పర్సానీ(57) తన కుమారుడు జితేంద్ర(42), కోడలు ఇషిత(40), మనవరాళ్లు ఖుషీ(21), కృష్ణ(12)లతో వివరాలు తెలుసుకున్నారు. జూన్ 24 నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

