రేపు ఐసీసీ అత్యవసర సమావేశం జరగనుంది. ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యవసర సమావేశం అవుతున్నారు. ఏఐసీసీ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నీట్ పరీక్షల లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చే అవకాశం ఉంది.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో పాటు డీలిమిటేషన్ బిల్లును తిరిగి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడం వంటి అంశాలను నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో సర్క్యులర్ ను పంపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని. దేశ వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించేందుకు ప్లాన్ చేయనున్నారు.

