తెలంగాణ:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి (MP Kunduru Raghuveer Reddy )కలిసి న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమయ్యారు.రాష్ట్రంలో రోడ్డు అనుసంధానాన్ని నిలుపుకోవడం,ప్రధాన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ,తెలంగాణకు సంబంధించిన జాతీయరహదారుల ప్రాజెక్టులు,కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

