దోహా: ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారత్, పాకిస్థాన్ పౌరులు ఖతార్ ప్రభుత్వం.
రాస్ లఫాన్ ద్రవీకృత సహజ వాయువు (LNG) కాంప్లెక్స్‌పై ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ దాడితో ఈ గ్యాస్ ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే, ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదరడంతో రాస్ లఫాన్ ప్లాంట్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కోరికనే సోమవారం (జూన్ 22) రాత్రి కార్మికులు పని చేస్తుండగా రాస్ లఫాన్ కాంప్లెక్స్‌లోని బర్జాన్ గ్యాస్ సరఫరాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది కార్మికులు సజీవ దహనం కాగా.. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థలంలో సహాయక ఘటనలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదాన్ని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ ధృవీకరించారు. ఈ ఘటనను ఆయన తీవ్ర విషాదంగా అభివర్ణించారు. మృతులలో, పాకిస్థాన్ సంతతికి చెందిన కార్మికులు ఉన్నారని తెలిపారు. రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ పునరుద్ధరణ పనుల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఖతార్ దేశీయ ఇంధన మౌలిక సదుపాయాలలో బర్జాన్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్లాంట్ రోజుకు దాదాపు 1.4 బిలియన్ ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఉత్పత్తిని కలిగి ఉంది. దీనిని ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి, అలాగే దేశంలోని డీశాలినేషన్ ప్లాంట్లకు శక్తిని అందించడానికి ఉపయోగించబడింది.
►ఇంకా చదవండి | బ్రిటన్ నెక్ట్స్ PM రేసులో ఆండీ బర్న్‌హామ్.. ఇంతకీ ఎవరీయనా..?
ఈ ప్లాంట్‌లో ఖతార్‌కు అత్యధిక వాటా ఉంది.. ఇంధన దిగ్గజం ఎక్సాన్మొబిల్కు మైనారిటీ వాటా ఉంది. రస్ లఫాన్ పోర్టు నుంచి భారత్, చైనా, జపాన్, ఉత్తర కొరియా, ఈయూకు గ్యాస్ ఎగుమతి అవుతోంది. ఈ గ్యాస్ ప్లాంట్ నుంచి ఎగుమతులు మళ్లీ ప్రారంభించేందుకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
ఇండియన్ ఎంబాసీ అత్యవసర హెల్ప్‌లైన్
రస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు ఘటనలో భారతీయులు మృతి చెందడంపై ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పౌరులు, వారి కుటుంబాల కోసం అత్యవసర హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. బాధితులకు, వారి బంధువులకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. సహాయం కోరుకునే వారు తమ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని రాయబార కార్యాలయం కోరింది.

