మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో అల్కాపూర్ ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసింది. ఓ ప్రైవేట్ హోటల్లో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముజఫర్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 944 గ్రాముల హాష్ ఆయిల్, 430 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నార్సింగి పోలీసులకు ఈగల్ టీం అప్పగించింది. పోలీసులు హాష్ ఆయిల్ సరఫరా నెట్వర్క్పై ఆరా తీస్తున్నారు. రాత్రి నార్సింగి పోలీసులను బురిడీ కొట్టించి నిందితుడు పారిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ముజఫర్ కోసం నార్సింగి పోలీసులు, ఈగల్ టీం గాలింపు చర్యలు చేపట్టారు.

