కన్నౌజ్: ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్, మాస్టర్ రొమాన్స్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు.. ఈ రొమాంటిక్ మాస్టర్ భార్య సీక్రెట్‌గా తరగతి గదిలో ఉంచిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బ్రేకింగ్ న్యూస్: కన్నౌజ్, ఉత్తరప్రదేశ్
సౌరిఖ్ బ్లాక్‌లోని మిశ్రమ ప్రభుత్వ పాఠశాల నుండి ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది, ఇది వివాదానికి దారితీసింది. క్లిప్‌లో మగ అసిస్టెంట్ టీచర్ మరియు మహిళా అసిస్టెంట్ టీచర్ పాఠశాల ఆవరణలో ముద్దులు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అనుసరిస్తున్న… pic.twitter.com/iisk0y3KqK
— శ్రీమతి అవన్నీ (@Avnni61) జూలై 15, 2026
విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉండి కామోద్రేకం మైకంలో మతి తప్పి ప్రవర్తించిన ఈ టీచర్లను.. దుష్ప్రవర్తన, వృత్తికి భంగం కలిగించే కారణాలతో సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ కాంపోజిట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సౌరిఖ్ బ్లాక్ బజేడి గ్రామంలో ఒకే ప్రభుత్వ పాఠశాలలో ఒక సహాయ ఉపాధ్యాయుడు, ఒక మహిళా సహాయ ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. ఈ ఘటన జనవరిలోనే జరిగింది. అయితే.. బాధితుడి భార్య ఇటీవల ఈ వీడియోను అప్లోడ్ చేసింది.
🚨 కన్నౌజ్, యుపి: ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఇద్దరు ఉపాధ్యాయులు రాజీ పడే పరిస్థితిలో ఉన్నట్లు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. pic.twitter.com/Qki0cFzseq
— మొహల్లే కా సీన్ (@mohallekascene) జూలై 15, 2026
భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మాస్టారు భార్య అతనిపై నిఘా పెట్టింది. స్కూల్లో తన భర్త ఒక టీచరమ్మతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో కన్ఫర్మ్ లో క్లాస్ రూంలో సీక్రెట్ కెమెరాను అమర్చారు. స్కూల్లో బ్రేక్ సమయంలో ఇద్దరు టీచర్లు ముద్దుగా పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకోవడంతో భార్య అనుమానం నిజమైంది.
►ఇంకా చదవండి | అమెరికాలో దారుణం: నువ్వు ముస్లింమా..? అని అడిగింది.. ఇండియన్ ని కత్తితో 15 సార్లు పొడిచి చంపాడు…
ఈ వీడియోలు బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, విద్యాశాఖ అధికారులు ఈ ఇద్దరు టీచర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 13న ఈ విషయంపై విద్యా శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరూ తప్పు చేసినట్లు తేలడంతో విద్యా శాఖ ఈ టీచరమ్మను, మాస్టారును సస్పెండ్ చేసింది.

