త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీనితో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.
మధ్యలో ఈ కథను ఎన్టీఆర్ కాదు.. అల్లు అర్జున్ చేయబోతున్నాడనే ప్రచారం కూడా బలంగా జరిగింది. దీనితో అసలు హీరో ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారింది.
ఇప్పుడు నిర్మాత నాగ వంశీ చేసిన ఒక్క పోస్ట్ అభిమానుల్లో మళ్లీ జోష్ నింపింది. రేపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఉంటుందని ఆయన అధికారికంగా హింట్ ఇచ్చారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ నే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందం పూర్తి క్లారిటీ మాత్రం రేపే రానుంది.
నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు రేపాటి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే గాడ్ ఆఫ్ వార్ పట్టాలెక్కితే టాలీవుడ్ లో మరో భారీ కాంబినేషన్ మొదలైనట్టే.

