విమానం గాల్లో ఎగురుతూనే ఉంది.. ఒక్కసారిగా భల్లున పేలిన శబ్ధం.. భారీ శబ్దంతో అప్పటివరకు నిశ్శబ్ధంగా ఉన్న ప్యాసింజర్ల క్యాబిన్ ఉలిక్కిపడింది. గాల్లో ఉండగానే విమానం కిటీకి అద్దం పగిలిపోయింది.. జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్నాడు ప్యాసింజర్..దగ్గర కూర్చున్న తోటి ప్రయాణికులు పట్టుకోవడంతో సేఫ్ అయ్యాడు. లేకపోతే విండోలోంచి గాల్లోకి ఎగిరిపోయేవాడు. రైనాఎయిర్ విమానం గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..
గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది. విమానం కిటికీ ఊడిపోవడంతో కిటికీ పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడు దాదాపు బయటఎగిరిపడినంత పనైంది. అయితే అతను సీట్ బెల్ట్ పెట్టుకుని, వెంటనే పక్కనే ఉన్న ప్రయాణికులు లోపలికి లాగడంతో ప్రాణాలతో బతికున్నాడు. లేకుంటే గాల్లో కలిసి పోయేవాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు.
ఈ గ్రీస్ ఘటనలోని థెస్సలోనికి జర్మనీలోని మెమ్మింగెన్కు వెళ్తున్న రైనాఎయిర్ విమానంలో జరిగింది. బాధితుడు సెర్బియాకు చెందిన పర్యాటకుడు. అతడికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి.
ప్రయాణికుల మాటల్లో… అందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే ఆక్సిజన్ మాస్కులు కిందకు పడిపోయాయి. విమానంలో ఎయిర్జర్ తగ్గడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. కిటికీ బాధిత ప్రయాణికుడి తల, భుజాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమయానికి కో ప్యాసింజర్లు లోపలికి లాగడంతో ప్రాణాలతో ఉన్నాడు అని ఓ ప్యాసింజర్ ఘటనను గుర్తు చేసుకున్నారు.
విమానం ఇంజిన్ నుంచి విడిపోయిన ఒక చిన్న భాగం కిటికీని తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి థెస్సలోనికి విమానాశ్రయంలో సురక్షితంగా దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

