దర్శక నిర్మాత డాక్టర్ యస్మన్
విశాలాంధ్ర – ధర్మవరం;; జులై 24వ తేదీన విడుదల కానున్న చంద్రప్పన్ సినిమాను విజయవంతం చేసేందుకు దర్శక నిర్మాత డాక్టర్ యస్మన్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సినిమా చిత్ర యూనిట్ లో నటినటులు ఉన్నట్లు తెలిపారు. తమ సొంత సంస్థ అయినటువంటి ఎలిగెంట్ ఎంటర్ టైస్మెంట్స్ నుండి చంద్రప్పన్ (రామసముద్రవాసి) అనే సినిమాకు కథ, కథనం, మాటలు, దర్శకత్వం, పాటలు తానే అందిస్తూ తన ప్రధాన పాత్రగా ఉంటూ సినిమా పూర్తి చేయడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాలి, ఇతర తారాగణం లో బలగం సంజయ్ కృష్ణ, వంశీ, అప్పాజీ, అంబరీష, భద్రం, రోషిణి, రజాక్, సీత, మహాలక్ష్మి, అబాస్ టీవీ డాక్టర్ హరిప్రసాద్, మారుతి, మహిత, చందు, హరీష్ కాకుండా రాయలసీమ నుండి దాదాపు 300 మంది వరకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. మ్యూజిక్ మహావీర్ కెమెరా కర్ణ, ఎడిటింగ్ ఓ మస్తా స్టూడియోస్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా మదనపల్లి తెరకు ఎక్కించడం జరిగింది. జులై 24వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని సకుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని వారు నిర్ణయించుకున్నారు.
పోస్ట్ చంద్రప్పన్ సినిమాను విజయవంతం చేయండి మొదట కనిపించింది విశాలాంధ్ర.

