ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేడు మత్స్యకారుల సేవలో నిధులు విడుదల చేయనున్నారు. కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. సముద్రంలో చేపల వేటకు విరామం నేపథ్యంలో సర్కార్ ఈ సాయం అందిస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వత మత్స్యకారుల సేవలో కుటుంబానికి ఇరవై వేల రూపాయల సాయం అందజేస్తుంది.
మొత్తం 1.30 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ది జరగనుంది. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు. *ఈరోజు సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చేరుకోనున్న చంద్రబాబు రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకొని.. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లి ఆర్ట్ ఆఫ్ లింగ్ కేంద్రానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

