ఐపిఎల్ 2026లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై.. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. కోల్ కతా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టడి చేశారు. ఈ ముంబై బ్యాటర్లు, భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే, చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 చేసింది.

