Published on: 5:55 am, 23 మే 2026
ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం… రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్త చర్చలకు తెర తీస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను అలా పక్కనబెడితే… కరువు పీడిత ప్రాంతంలో ఉన్న రాయలసీమలో వరుసబెట్టి పరిశ్రమలు ఏర్పాటవుతున్న తీరు ఈ చర్చల విస్తరణను మరింతగా పెంచిందని చెప్పక తప్పదు. ఇలాంటి కోరికనే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కడప జిల్లా జమ్మలమడుగులో ఓ భారీ సోలార్ ప్రాజెక్టుకు శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ యూనిట్ ను ప్రారంభించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి.
జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాల ఖిల్లా కిందే లెక్క. గతంలో ఫ్యాక్షన్ తరహా నెత్తుటరులు లేకున్నా… ఇప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని చెప్పక తప్పదు. అయితే ప్రభుత్వం చేపట్టిన అధికారం తర్వాత అన్ని ప్రాంతాలతో పాటుగా జమ్మలమడుగుపైనా దృష్టి సారించింది. ఒక్క జమ్మలమడుగే కాకుండా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని ప్రాంతాలను చూస్తున్న కూటమి ప్రభుత్వం… ఆయా ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్న కోణంలో ఆలోచించి మరీ ఆ మేరకే అడుగులు వేస్తోంది.
ఈ తరహా చర్యల్లో భాగంగా ఇటీవలే తిరుపతి జిల్లా సత్యవేడులో రాయల్ ఎన్ ఫీల్డ్ తన మోటార్ బైకుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీకి తమిళనాడు మినహా మరెక్కడా కూడా తయారీ ప్లాంట్ లేదు. తమిళనాడు వెలుపల తొలి తయారీ ప్లాంట్ కి ఆ కంపెనీ ఏపీనే ఎంచుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాఖ ఫైటర్ జెట్ల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే… ఆ యూనిట్ ను ఏపీకి ప్రత్యేకించి రాయలసీమకు తీసుకొచ్చే విషయంలో కూటమి సర్కారు సత్తా చాటింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇటీవలే ఈ యూనిట్ కు భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే.
ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే… సోలార్ విద్యుత్ తయారీలో అగ్రగామిగా ఎదుగుతున్న సీల్ కంపెనీని కూటమి ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ ఏపీలో తన ప్లాంట్ నునెలకొల్పేందుకు సిద్ధపడగా… ఆ కంపెనీకి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఫలితంగా 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను సీల్ కంపెనీ కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసింది. వాస్తవానికి నీటి లభ్యత లేని జమ్మలమడుగు లాంటి ప్రాంతాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. అదే కార్యక్రమం పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి జమ్మలమడుగుకు ఓ భారీ పరిశ్రమను అందించిన వైనం నిజంగానే అభినందనీయమని చెప్పక తప్పదు.

