టాక్సిక్ నుంచి కొత్త పాట వచ్చింది. ఈసారి యష్ తో తారా సుతారియా రొమాన్స్ చేసింది. తబాహి లాగే ఇందులో యువత కూడా చేసుకున్న కౌగిలింతలు, చుంబనాలు, టార్గెట్ కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి. ట్యూన్ కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు సాంగ్స్ ఒకే హైలైట్ చేయడం చూస్తుంటే యాక్షన్ కన్నా ఎక్కువగా బోల్డ్ కంటెంట్ మీద ఆధారపడ్డారేమోననే అనుమానం కలిగితే అది ఎవరి తప్పు కాదు. కంటెంట్ అలా ఉంది.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని తలకెత్తుకున్నప్పుడు ఆవిడ సరిగా నిర్వర్తించగలరా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. టీజర్లో కొంత భాగాన్ని తీర్చింది. ట్రైలర్ వచ్చాక పూర్తి క్లారిటీ వస్తుంది. తండ్రి కొడుకులుగా యష్ డ్యూయల్ రోల్ చేసినట్టుగా ఆల్రెడీ క్లూస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందనే దాని మీద ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గ విజువల్స్ ఇంకా బయటికి రాలేదు.
ప్రమోషన్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం జరగాలి. కానీ టాక్సిక్ టీమ్ తీరు చూస్తుంటే హీరో పాత్రలోని రసికతను హైలైట్ చేయడం కోసమే కష్టపడుతున్నట్టు కనిపించాడు. ఇది ఎంత వరకు మేలు చేస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే టాక్సిక్ పూర్తిగా యష్ పేరు మీద బిజినెస్ చేసుకుంటున్న సినిమా. గీతూ మోహన్ దాస్ కి ఎలాంటి మార్కెట్, ఇమేజ్ లేదు. కాంబో కుదిరినప్పుడు జనంలో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించనిది ఇందుకే. సో ఆమెకిది పెద్ద సవాలే.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఎస్వీసి విడుదల దిల్ రాజు దీన్ని ఏపీ తెలంగాణలో చేయబోతున్నారు. జన నాయకుడు కూడా ఆ డీల్ లో భాగంగానే తీసుకున్నారట. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లు నటిస్తున్న టాక్సిక్లో హ్యూమా ఖురేషి మరో ప్రధాన పాత్ర పోషించారు. ట్రైలర్ వచ్చాక లెక్కలన్నీ మారిపోతాయని టీం ధీమాగా ఉంది. చూడాలి మరి ఏం చేస్తారో.

