ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు, సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి, కొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా టాచ్ అయిపోయి ఉంటారు. రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బ్యాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు. అయితే నేటి కాలంలో ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది. చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపుతుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బ్యాండింగ్ ను అర్థం చేసుకోవాలి. అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..
ట్రామా బ్యాండింగ్..
ట్రామా బ్యాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. ఒక వ్యక్తి, అతనికి మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వలన సంభవించే రిలేషన్ కు ఎమోషన్ గా అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం అంటే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని బయట పడటం కష్టంగా మారుతుంది.
ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుతుంది?
ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని సంబంధాలలో సాధారణంగా ట్రామా బ్యాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. వాటిలో కొన్ని..
రిలేషన్ లో పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది. ఇవి మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా ప్రేమ కనిపిస్తుంది, కొన్నిసార్లు ఉన్నట్టుండి దూరం పెరిగింది లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది.
ఎమోషన్ ఇతరుల పరంగా బాగా ఎక్కువ ఆదారపటం, భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.
ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది. భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది.
ట్రామా బాండింగ్ సిగ్నల్స్..
ట్రామా బ్యాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం, మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం.
ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,
ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.
సంబంధంలో అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం. ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం.
ఎలా బయట పడాలి..
ట్రామా బ్యాండింగ్ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమే లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.
మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం
మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.
ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని. ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.
తమ కోసం తాము సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి.
ట్రామా బ్యాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం..
ట్రామా బ్యాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన, మార్పులేని జీవితం వైపు పయనించగలుగుతారు.
*రూపశ్రీ.

