Diabetes Diet: మధుమేహం ఉన్నవారిలో తరచుగా వినిపించే ప్రశ్న రోటీ తినాలా, అన్నం తినాలా అనేదే. ఈ అంశంపై ప్రముఖ మధుమేహ నిపుణులు కీలక సూచనలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో రోటీ సాధారణంగా అన్నం కంటే మెరుగైన ఎంపికగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. వైద్యుల ప్రకారం రోటీ ఒక కార్బోహైడ్రేట్ కావడంతో అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనితో గ్లూకోజ్ రక్తంలోకి క్రమంగా విడుదలై చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా పెరుగుతాయి. ముఖ్యంగా గోధుమతో పాటు శనగపిండి, సజ్జలు, జొన్నలతో తయారైన మల్టీగ్రెయిన్ రోటీలు మరింత ప్రయోజనకరమని సూచించారు.
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సలాడ్ తీసుకోవడం, లేదా అనంతరం ఆహారం తీసుకున్న తర్వాత అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని ఆయన చెప్పారు. ఆహార ఎంపికలు, భోజన పద్దతులు పాటించడం ద్వారా మధుమేహ నియంత్రణ సరైన రీతిలో సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

