ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ..ప్రాణాంతాక వైరస్ వ్యాప్తి చెందుతుందని బోర్డులు.. ఉన్నట్టుండి ప్రయాణికులకు స్క్రీనింగ్ స్టేషన్లు..డిస్టెన్స్ పాటించాలని సూచనలు కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లాంటి దేశాలను వచ్చేవారికి హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎబోలా వైరస్ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇటీవల ఆఫ్రికాలోని కాంగో (DRC), ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ కేంద్ర ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే మన దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ స్క్రీనింగ్ చేస్తున్నారు.
ఇంకా చదవండి:మా వాహనాల్లో డీజిల్ లేదు.. మీ కుమార్తెను ఎలా వెతకాలి: స్టేషన్ లోనే పోలీస్ ఆఫీసర్ డబ్బులు డిమాండ్..!
విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ మార్గదర్శకాలు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) జారీ చేసిన తాజా గైడ్లైన్స్ ప్రకారం ..ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుండి వచ్చే ప్రయాణికులు, ఆయా దేశాల మీదుగా ప్రయాణించే వారికి ప్రత్యేకంగా వస్తువులను అందజేస్తున్నారు. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో ఎవరికైనా లక్షణాలు ఉంటే, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కంటే ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ (APHO) లేదా హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించింది.
ఎబోలా లక్షణాలు..
ఎబోలా సోకిన వారిలో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన జ్వరం ,తలనొప్పి
కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం
గొంతు నొప్పి
వాంతులు, విరేచనాలు ,కడుపు నొప్పి
వ్యాధి తీవ్రత పెరిగితే ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం సంభవిస్తుంది.
ఆందోళన వద్దు ..
కోవిడ్-19 లాగా ఎబోలా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. ఇది కేవలం సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట లేదా ఇతర శారీరక ద్రవాలను నేరుగా తాకడం ద్వారా మాత్రమే ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. అందువల్ల సాధారణ ప్రయాణికులకు లేదా ప్రజలకు దీని రిస్క్ చాలా తక్కువని ఎయిమ్స్ ,మెదాంత వైద్య నిపుణులు వివరించారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్: ప్రయాణికులకు స్క్రీనింగ్ స్టేషన్లు..కొత్త వైరస్ తో ఆందోళన!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

