ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ పోలీసులు తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఐఎస్ఐసహకారంతో అన్ని విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు అందించిన సమాచారం మేరకు ఢిల్లీలో ఈ కుట్రను భగ్నం చేశారు. వీరికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు పేర్కొన్నారు.
ఐఎస్ఐ ప్రోద్బలంతో…
న్యూక్లియర్ ప్లాంట్‌తోపాటు సంస్థలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు పోలీసులకు అందిన సమాచారం. ఈ మేరకు దాడులు చేసి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఢిల్లీ, పంజాబ్, ముంబయికి చెందిన వారున్నారు. ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందిన వారు దేశంలో అనేక చోట్ల దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు

